తెలుగు భాషా వికాస ఉద్యమం వారి ఆధ్వర్యంలో ఈరోజు మా స్కూల్ కాంప్లెక్స్ తరఫున కార్యక్రమం నిర్వహించాము. కొన్ని ప్రాథమిక పాఠశాలలను ఒక ఉన్నత పాఠశాలతో అనుసంధానం చేస్తారు. వీటిని కలిపి స్కూల్ కాంప్లెక్స్ అంటారు. నేను కాంప్లెక్స్ సహాయ కార్యదర్శిగా బాధ్యత నిర్వరిస్తున్నాను. తెలుగుభాష పట్ల పిల్లల్లో ప్రేమను పెంచడం, అలాగని ఆంగ్లాన్ని పక్కనపెట్టడం కాదు. అనవసరంగా ఆంగ్లాన్ని వాడొద్దు, మమ్మీ డాడీలు లాంటివి వద్దు. ఇలాంటి అంశాలతో పిల్లలను చైతన్య పరచడం ఈ కార్యక్రమం ఉద్దేశం. దీన్ని ఆకాశవాణి ప్రయోక్త మరియు తెలుగు భాషావికాస ఉద్యమం జిల్లా బాధ్యులు శ్రీ శ్యామసుందర శాస్త్రి గారు నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలతో శతక, భారత, భాగవత పద్యాలు చెప్పించడం, క్విజ్, పిల్లల సంప్రదాయ నృత్యాలు, పాటలు, అల్లూరి సీతారామరాజు, ఒక వృద్ధ రైతు ఏక పాత్రాభినయం వంటి కళారూపాల ప్రదర్శన జరిగింది.
క్విజ్ విజేతలకు శాస్త్రిగారు, కాంప్లెక్స్ తరఫున మేము సంయుక్తంగా బహుమతులు అందజేసాము.
క్విజ్ నేను, మరో ముగ్గరు తెలుగు ఉపాధ్యాయులు నిర్వహించాము. క్విజ్ నిర్వహిస్తున్నపుడు ఆంగ్ల పదం దొర్లినప్పుడల్లా శాస్త్రిగారు లేచి మాకు నమస్కారం పెట్టి ఇబ్బంది పెట్టారు :)  

Expenditure for Girls Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-

JULY - 2014

1,00,000 - 3.7.14 & 10.5.14 - cement ( amount paid today )
20,600 - 3.7.14 - flooring stones ( tandoor ) 1,20,600/-
9,000 - 7.7.14 - mason labor - 1,29,600/-
800- 8.7.14 - labor
10,907-10.7.14 - plumbing material 1,41,307/-
9800 - 12.7.14 - mason labor
1500 - 12.7.14 - plumbing labor
9000 - 12.7.14 - welding labor
400 - 12,7,14 - pvc pipe 1,62,007/-
10000-15.7.14 - pvc tank
10500 - 15.7.14 - flouring labor 1,82,507/-
2000 - 16.7.14 - tandoor tiles
1350 - 17.7.14 - iron mesh
10800 - 19.7.14 - mason labor 1,96,657/-
TOTAL - 8,88,267/-


 




on
categories: | edit post

1 Responses to ఈ రోజంతా తెలుగు శ్వాసించాము

  1. మంచి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు భాష అంతరించిపోతుందా అనే భయం కలుగుతున్న ఈ రోజుల్లో మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించండి.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo