మిత్రులారా గడచిన మూడు సంవత్సరాల్లో జీవని ఊహించని పురోగతిని సాధించింది. ఇందులో ప్రధానపాత్ర జీవని ప్రధాన కార్యదర్శి మరియు Sreenivasa Ramanujan Institute of Technology కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డిగారిది మరియు తెలుగు బ్లాగర్లదే. జీవనికి వస్తున్న విరాళాల్లో 30-40 శాతం బ్లాగుద్వారా వస్తున్నవే. మీరు ఇస్తున్న ఆర్థిక నైతిక మద్దతుకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

ఇప్పుడు మరోసారి మీనుంచి భారీ సహాయం కోరుతున్నాము. ప్రస్తుతం ప్రతి కంపెనీ కూడా సేవా కార్యక్రమాలకు కొంత డబ్బును కేటాయిస్తోంది. మీరు పనిచేస్తున్న కంపెనీ నుంచి అలాంటి అవకాశం వస్తే, మీరు వారిని ప్రభావితం చేయగలిగితే దయచేసి జీవనికి సహాయం చేయండి. ఇది జీవని విద్యాలయం కోసం...

జీవని విద్యాలయం ప్రాజెక్టు వివరాలు.

Classes : LKG, UKG, I & II classes ( 2013 - 14 )
class rooms : 4+1 ( extra ) sheds + furniture + computers 
Estimated cost : 5 Lakhs



మాకు షెడ్ల నిర్మాణం వరకు సహాయం చేస్తే చాలు. నిర్వహణకు ఇబ్బంది ఉండదని మా నమ్మకం. కింది వివరాలు కేవలం మీకు తెలియడం కోసం మాత్రమె. 

intake: 25 x 4 = 100
teachers : 4

salaries : 5000x4= 20,000
watchman: 3,000
other expenditure: current bill etc. 2000/- 
total expenditure per year: 3 lakhs 
miscellaneous: 25,000/-
fee structure : 300/- per month per a kid
 

 జీవని పిల్లలతో పాటు బయటి పిల్లలను కూడా తీసుకొంటున్నాము.
 

సాంబశివారెడ్డిగారు ప్రస్తుతం ఉంటున్న జీవని హోం నిర్మాణానికి 40 లక్షల వరకు సహాయం అందించారు. కాబట్టి ఇక ఆయన మీద భారం పెట్టకూడదని ఈ ప్రాజెక్ట్ ను మీ అందరి ముందూ పెడుతున్నాము. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజి అన్ని సీట్లను భర్తీ చేసుకుని జిల్లాలోనే అగ్ర స్థానంలో ఉంది. అయితే 5 సంవత్సరాల ఈ కాలేజి ఇంకా బ్రేక్ ఈవెన్ కు రాలేదు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ జీవని హోం ను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు సాంబశివారెడ్డి. జీవని నిర్వహణకు ప్రస్తుతం 70-80 వేలు ఖర్చు అవుతోంది. 40 వేలు నెలనెలా రెగ్యులర్ విరాళాలు ఉన్నాయి. మిగతా 30-40 వేలు తక్కువ ఉన్నా ప్రతిసారీ ఎవరో ఒకరు ఆదుకుంటున్నారు. ఆగస్టు నుంచీ ఇప్పటి వరకూ ఎలాంటి సమస్యనూ ఎదుర్కొనలేదు.  ఇదే స్పూర్తితో జీవని విద్యాలయం కోసం ముందడుగు వేస్తున్నాము. 

మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ 
మీ 
జీవని. 
jeevani.sv@gmail.com 

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo