మిత్రులారా ఇది జీవని సభ్యులు శ్రేయోభిలాషులు అందరికీ శుభవార్తే. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు ఏటా కొన్ని చొప్పున మూతపడుతున్నాయి. వందలాది సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల అద్భుతం సృష్టించింది. స్థాపించిన 5 సంవత్సరాలకే నెంబర్ వన్ స్థానానికి ఎదిగింది. మొన్నటి కౌన్సిలింగ్ లో 98% సీట్లు ఫిలప్ అయిపోయాయి. ఐటిలో మాత్రం 13 సీట్లు మిగిలాయి. ఇవి కూడా సెకెండ్ ఫేజ్లో భర్తీ కానున్నాయి. 

దీని వెనుక కరస్పాండెంట్ సాంబశివారెడ్డి అకుంఠిత దీక్ష, కళాశాల సిబ్బంది శ్రమ ఉన్నాయి. 

సాంబశివారెడ్డి లేకపోతే జీవని ఈ స్థాయిలో ఉండేది కాదు. ఎందరో మిత్రులు సహాయసహకారాలు అందిస్తున్నా, హాస్టల్ నిర్మాణం ఇప్పుడు నిర్వహణ చాలా చాలా కష్టమైన పని. జీవనికి అన్నీ తానై కొండంత అండగా సాంబశివారెడ్డి ఉంటున్నారు. 


నిజానికి ఆయన్ ఔదార్యం, మానవతా దృక్పథం, స్నేహశీలత అడుగడుగునా శ్రేయోభిలాషుల్ని తయారుచేసిపెట్టాయి. SRIT లో పిల్లలు చదువుతున్నారంటే తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండొచ్చు అని భావిస్తారు. 


మా అందరికీ అలాంటి మిత్రుడు ఉండటం మేము అదృష్టంగా భావిస్తాము. జీవనికి ఆయన ప్రధానకార్యదర్శి కావడం గర్వకారణం.


SRIT దినదినాభివృద్ధి చెందాలని గొప్ప స్థాయికి చేరుకోవాలని జీవని కుటుంబం తరఫున దేవుడిని ప్రార్థిస్తున్నాము. 


on
categories: | edit post

1 Responses to అనంతపురం జిల్లాలో నెంబర్ 1 SRIT

  1. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    లాస్య రామకృష్ణ
    బ్లాగ్ లోకం

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo