మిత్రులారా ఎలాంటి అవాంతరాలు రాకపోతే ఈ నెల 19న జీవని విద్యాలయం నిర్మాణానికి పునాది రాయి పడనుంది. కాసేపటి క్రితం జిల్లా కలెక్టర్ జనార్ధన రెడ్డి గారిని కలిశాము. మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి ఆయన అంగీకరించారు. ఆయనతో పాటు RDT Programme Director మాంచొ ఫెర్రర్ గారు, DRDA Project Director రంగయ్య గారు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఇంకా జిల్లాకు చెందిన ముఖ్య అధికారులు హాజరు కానున్నారు. రాజకీయ నాయకులను, ప్రజా ప్రతినిధులను పిలవడం లేదు.


మాంచొ తండ్రి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి వర్ధంతి రోజు కూడా 19 వ తేదీనే. మాంచొ ఆ రోజు చాలా బిజీగా ఉన్నప్పటికీ రావడానికి అంగీకరించారు.

జీవనికి అండదండగా వుంటున్న బ్లాగు మిత్రులందరికీ, సభ్యులకు ఫోన్ ద్వారా ఆహ్వానాన్ని తెలియజేస్తాము.




on
categories: | edit post

1 Responses to ఈ నెల 19 న జీవని విద్యాలయం శంకుస్థాపన

  1. All the Best..

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo