చిన్నారి పి. సాయి తరఫున తల్లిదండ్రులు పి.సునీత మరియు పి.సుబ్బా రెడ్డి గార్లు ( అనంతపురం ) జీవని విద్యాలయం నిర్మాణానికి గానూ 25,000/- విరాళం అందజేశారు. వారికి జీవని ధన్యవాదాలు తెలియజేస్తోంది.

Read More




మిత్రులారా ల్యుకేమియాతో బాధపడుతున్న రమ అనే పేషెంట్కు రక్తం అవసరం అని బ్లాగులో టపా పెట్టాము.అలాగే జీవని సభ్యులకు మెసేజి పంపాము. చాలా గొప్ప స్పందన వచ్చింది. ఆమెకు మనం రెండోసారి రక్తదానం చేయించాము. దాతలకు ధన్యవాదాలు.సహృదయులైన రక్తదాతలు సత్వరం స్పందించి సహాయం చేశారు. తమ ఆఫీసు పనివేళలు, విపరీతమైన ట్రాఫిక్ వీటన్నిటిని అధిగమించి ఆస్పత్రికి వచ్చారు. ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఈ సారి రక్తదానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మిడుతూరు సురేష్ రెడ్డికి ( సాఫ్ట్ వేర్ ఇంజనీర్, క్యాప్ జెమిని, హైదరాబాద్ ) ధన్యవాదాలు. అలాగే రెండుసార్లు తన వంతు కృషి చేసిన మన బ్లాగర్ కార్తీక్ (నా స్వగతం, ప్రపీసస ) కు జీవని కృతఙ్ఞ్తలు తెల్పుతోంది.



మీ అందరి మానవత్వం, సహాయ సహకారాలే జీవనికి ఊపిరి. మీ అంచనాలకు తగ్గకుండా పూర్తి పారదర్శకతతో మరింత సేవకు అన్నివేళలా మేము కూడా సిద్ధంగా ఉంటామని సవినయంగా తెలియజేసుకుంటున్నాము.


మీ

జీవని.


Read More



మిత్రులారా ఈ నెలలో గార్లదిన్నె వద్ద జీవని విద్యాలయానికి శంకుస్థాపన జరగాల్సి ఉంది. అయితే కొన్ని సమస్యల వల్ల మనం గార్లదిన్నె వద్ద బడి నిర్మించడం వద్దు అనుకున్నాము. ప్రస్తుతం అనంతపురానికి మరింత దగ్గర్లో స్థలం సేకరించే పనిలో ఉన్నాము. ఏది ఏమైనా ఎన్ని సమస్యలు ఎదురైనా 14-06-2011న జీవని విద్యాలయంలో తరగతులు ప్రారంభం అవుతాయి.



దాతల నుంచి స్థల సేకరణ వద్దు అని ఒక నిర్ణయం తీసుకున్నాము. ప్రభుత్వ స్థలం లేదా జీవని కోసం చురుగ్గా పని చేస్తున్న వ్యక్తులం కలసి స్థలం కొనాలని అనుకున్నాము. చివరి అవకాశం మాత్రమే దాతలకు ఇస్తున్నాము ( స్థలం కొనిస్తామని దాతల నుంచి ఒత్తిడి ఉంది ) జీవని కాన్సెప్టుకు స్వేచ్చా స్వాతంత్ర్యాలకు సార్వభౌమత్వానికి భంగం కలగకుండా, బేషరతుగా స్థలం ఇస్తేనే దాతల నుంచి స్వీకరించడం జరుగుతుంది.


ఈ నెలాఖరుకు స్థలం సేకరించాలని గడువు విధించుకున్నాము. వచ్చే వారంలో జిల్లా కలెక్టరు గారిని జీవని బృందం కలవనుంది.



మీ,


జీవని.



Read More




మిత్రులారా జీవని సంస్థను ప్రారంభించి సంవత్సరం దాటింది. సంస్థకు సంబంధించి అన్ని పనులను నేను చూసుకుంటూ వచ్చాను. ప్రస్తుతం లోకల్ గా దాతల దగ్గరకు వెళ్ళి విరాళం స్వీకరించడం, జీవని విద్యాలయానికి సంబంధించిన పనులు, బ్యాంకు వ్యవహారాలు ఇవన్నీ చూసుకోవడానికి సమయం సరిపోవడం లేదు. ఈ క్రమంలో దాతలు విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కొన్నిసార్లు స్వీకరించలేకపోయాము. ఈ పనులన్నీ చేయడానికి ఒక సహాయకుడిని నియమించాము. ఆ అబ్బాయికి నెల జీతం 1000/- దీనికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉన్నా దయచేసి తెలియజేయగలరు. జీవని సభ్యులే కాక ఎవరైనా తమ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు.


మీ,


జీవని.




Read More


మిత్రులారా బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్న రమ అనే పేషెంట్ కు జీవని తరఫున పలువురు స్పందించి గతంలో రక్త దానం చేసిన విషయం మీకు గుర్తు ఉంటుంది. ఇప్పుడు ఆమెకు మరోసారి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. బ్లడ్ గ్రూపుతో సంబంధం లేదు, ఏ గ్రూపు వారైనా సరే రక్తం ఇవ్వవచ్చు.


ఆమె ప్రస్తుతం బెంగుళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో ఉన్నారు. బెంగళూరులో మీ మిత్రులు ఉంటే దయచేసి ఈ విషయాన్ని తెలిపి మరికొంతమందికి తెలిసేలా చేయాలని కోరుతున్నాము.


దాతలు 09440601316( రమేష్ )ను సంప్రదించవలసిందిగా మనవి.


మీ,


జీవని

Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo