అనంతపురానికి చెందిన ప్రముఖ రచయిత, జిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డా. శాంతినారాయణ గారు జీవని విద్యాలయం నిర్మాణానికి 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అనంతపురానికి 18 కిలోమీటర్ల దూరంలో గార్లదిన్నె దగ్గర జీవని విద్యాలయం నిర్మించనున్న సంగతి మీకు తెలిసిందే. ఎవరైనా ఆయనను అభినందించాలి అనుకుంటే 9348278277 కు ఫోన్ చేయవచ్చు.

జీవని పిల్లలు, సభ్యుల తరఫున ఆయనకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము.


మిత్రులారా నిన్నటి రోజు శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాలలో జీవని విద్యాలయం బ్రోచర్ ఆవిష్కరణ, వెబ్ సైట్ ప్రారంభం విజయవంతంగా జరిగాయి. సాంకేతిక కారణాల వల్ల ఫోటోలు రాలేదు. తదుపరి టపాలో పూర్తి వివరాలు అందజేయగలం.

మీ,

జీవని.

Read More



మిత్రులారా రేపు ఉదయం 26.1.2010, 10 గంటలకు జీవని విద్యాలయం బ్రోచర్ ఆవిష్కరణ మరియు జీవని వెబ్ సైట్ ప్రారంభోత్సవం జరగనుంది. వేదిక శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నల్లారెడ్డి పల్లె, అనంతపురం.


ఈ సందర్భంలోనే ఇంజనీరింగ్ కాలేజీలో జీవని విరాళాల కోసం ఒక బాక్సు ఏర్పాటు చేస్తున్నాము.

ఇంజనీరింగ్ విద్యార్థులు పిల్లలకు ఒక జత బట్టలు స్పాన్సర్ చేశారు అవి అందజేయనున్నాము.


రెండు సెక్షన్ల విద్యార్థులు నెలకు ఒక్కొక్కరు ఐదు రూపాయల చొప్పున ఫండ్
కలెక్ట్ చేస్తున్నారు వారిని అభినందించడం.

ఇవీ రేపటి కార్యక్రమాలు. అనంతపురంలో ఉన్న మిత్రులు రావడానికి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాము.

అందరికీ హృదయపూర్వక ఆహ్వానం.

మీ,
జీవని.


Read More




శ్రీమతి. పద్మావతి ( చైర్ పర్సన్ , శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల, అనంతపురం ) తన పుట్టిన రోజు సందర్భంగా జీవనికి 10000/- విరాళం ఇచ్చారు. జీవని పిల్లలు, సభ్యుల తరఫున పద్మావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.






Read More

చాలా ఏళ్ల కిందట ఒక మిత్రుడు చెప్పాడు ఈ కాన్సెప్ట్ ను. మొదటి సంతానం కలిగాక అక్కడితో ఆపేసి, రెండో పాప బాబు కావాలనుకున్నపుడు ఒక అనాధను దత్తత తీసుకోవాలి అని చెప్పాడు. దీనివల్ల ఒకరికి పూర్తి స్థాయి జీవితాన్ని ఇవ్వగలిగినవారు అవుతారు. జనాభా సమస్య అరికట్టడానికి వ్యక్తిగత స్థాయిలో కృషి చేసినట్లు అవుతుంది. ఒక అనాథకు జీవితం ఇవ్వడం అంటే వారు ఒక జీవితానికి సరిపడా సేవ చేసినట్లే అని నా భావన.


అలాగే పిల్లలు లేనివారు ఏళ్ళతరబడి అలా పిల్లలకోసం ఖర్చు పెట్టుకునే బదులు దత్తత తీసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా ఈ వైద్యం చేయించుకునే క్రమంలో ఆడవారికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి మరోరకమైన హింస. వర్తమానాన్ని ఆనందించడం మాని చాలామంది భవిష్యత్తు కోసం బాధ పడుతుంటారు. విసిగివేసారిన దంపతులకు ఆ పాప / బాబు రాక అంతులేని సంతోషాన్ని ఇస్తుంది. దాన్ని ఆస్వాదించాలి. సమాజం, బంధువులు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ మొదట వదిలేయాలి. మనం జీవిస్తోంది మనకోసం. మనం ఎవ్వరికీ హాని చేయడం లేదు.

ఏమి చేసినా ఎన్ని సాధించినా మనం మూటగట్టుకు పోయేది ఏం లేదు.

పిల్లలు లేని రెండు జంటలకు నేను ఈ విధమైన చైతన్యం కల్పించగలిగాను. రెండో జంటతో ఈ రోజు నేను స్వయంగా అప్లికేషన్ వేయిస్తున్నాను.

వీరికంటే ముందు నేను ఆచరించాను. మా పాప చాలా చాలా యాక్టివ్. మా ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా ఉన్నాం.

మీ పరిధిలో పిల్లలు లేని దంపతులకు ఈ రకమైన చైతన్యం కల్పించండి. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలోని ICDS కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే హైదరాబాద్ లోని శిశువిహార్ కార్యాలయంలో ఇవ్వవచ్చు. కాకపోతే పిల్లలు తీసుకోవడానికి మన వంతు రావాలంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. అందుకే అప్పటికప్పుడు అని కాకుండా ఒక దరఖాస్తు వేసి, ఈ లోపు పిల్లలు కలిగితే దాన్ని రద్దు పరచుకోవచ్చు.



Read More


.




ఇంతకంటే సంతోషకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం










మనల్ని పలకరించేవారు కనీసం ఒకరిద్దరైనా ఉన్నారు.











మన రోడ్లు ఇంత అధ్వాన్నంగా అయితే లేవు.











మన జీవితం ఈ అవ్వ కంటే దారుణంగా అయితే లేదు కదా?


మరి మనం ఎంత అదృష్టవంతులం?







ఇలాంటి చక్కటి మెయిల్స్ పంపుతున్న మిత్రులు కందికేరి విశ్వనాథ్ ( software engineer, 3I infotech, chennai ), చందు ( M Tech, IIT, kharagpur ) గార్లకు ధన్యవాదాలతో....


జీవని,

అనంతపురం



Read More







































Read More



ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిత్రులారా రాబోయే మూడు సంవత్సరాలు జీవని సంస్థకు ఎంతో కీలకం. 200 మంది పిల్లలకు నీడను ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ జూన్ లో అనంతపురానికి 18 కిలోమీటర్ల దూరంలో స్కూల్ & హాస్టల్ ( జీవని విద్యాలయం ) నిర్మాణం ప్రారంభిస్తున్నాము. దాదాపు 60 లక్షలు అవుతుందని అంచనా. ఇపుడు మన దగ్గర ఉన్న సొమ్ము 1 లక్ష. ఇక కేవలం 59 లక్షలు మాత్రమే అవసరం. ఆ తర్వాత మెయింటెనెన్స్ కు నెల నెలా 2 లక్షలు అవుతుంది. ఇన్ని లక్షల లక్ష్యాన్ని అందుకోగలమా??? చూద్దాం....



కిందటి యేడాది ఇదే నెలలో జీవనిని ప్రారంభించిన క్షణంలో ఇంత అభివృద్ధిని కల గనే ధైర్యం కూడా నాలో లేదు. అప్పుడు ' నేను ' మాత్రమే, సరిగ్గా సంవత్సరానికి మేము... మనం... ఒకరికొకరు తోడు అవుతూ జీవని విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత లక్ష్యాన్ని అధిగమిస్తాం అన్న ధైర్యం కూడా వచ్చింది.


ఇందుకు ధైర్యానికి, సేవకు మారుపేరైన ఆలూరు సాంబశివారెడ్డి ( CORRESPONDENT, SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY ) తోడ్పాటు ఎంతో ఉంది. అన్నీ తానై జీవనిని తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు. ముందుకు నడిపిస్తున్నారు. అలాగే జీవని సలహామండలి చైర్మన్ జగదీశ్వర రెడ్డి గారు. ఇలా చెబుతూ పోతే మానవ వనరుల పరంగా, ఆర్థికంగా ఇంకా రక రకాలుగా సేవలు అందిస్తున్నవారు ఎందరో ఉన్నారు. అందరికీ జీవని తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


2009 లో జీవని కార్యకలాపాలు

తల్లిదండ్రులు లేని ఆరుగురు పిల్లలకు మనం నీడనిస్తున్నాం.

కర్నూలు వరదబాధితులకు సహాయాన్ని అందించాం.

రక్తదాన కార్యక్రమంలో సహాయపడ్డాం.



2010 లో సాధించాల్సినవి.

25 మంది పిల్లల్ని జీవని కుటుంబంలోకి తీసుకురావడం.

జీవని విద్యాలయం నిర్మాణం.



అన్నీ సక్రమంగా జరగాలని, సేవకు వారధిగా జీవని అందరి హృదయాల్లోనూ నిల్చిపోవాలని కోరుకుంటూ...



మీ

జీవని.


Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo