ABOUT JEEVANI...

quick view : JEEVANI is an orphanage. Giving shelter to 37 parentless children. It is located in Rotary puram village, Bukkaraya samudram mandal, Anantapur district, Andhra pradesh, India
contact : jeevani.sv@gmail.com, phone: +91 9440547123
 
account details:
SBI : JEEVANI VOLUNTARY ORGANISATION, CURRENT ACCOUNT 30957763358 
TREASURY BRANCH, ANANTAPUR, IFSC CODE : SBIN0012831

ICICI : JEEVANI VOLUNTARY ORGANISATION, CURRENT ACCOUNT 043905000999 ANANTAPUR IFSC CODE: ICIC0000439

ANDHRA BANK : JEEVANI VOLUNTARY ORGANISATION, S.B. ACCOUNT 038510100023594, 0385 NEW TOWN ANANTAPUR COURT ROAD. IFSCCODE: ANDB0000385
 
request to NRIs, pl. send your dontions only from your INDIAN ACCOUNT, we don't have permission to receive foreign currency as donations. 

Read More



జీవని స్వచ్చంద సంస్థకు నాగరాజు, గీతావాణి, మురళీక్రిష్ణ, రోహిత్ గార్లు ఈ రోజు 10011/- విరాళంగా ఇచ్చారు. వారికి బ్లాగు పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము




మురళీక్రిష్ణ, రోహిత్ గార్ల నుంచి విరాళం అందుకుంటున్న జీవని కోశాధికారి నంజమ్మ గారు.




Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123


.

Read More




మిత్రులారా నిన్న సాయంత్రం జీవని కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


1) స్థల దాతలు ముందుకు వచ్చిన నేపథ్యంలో, మనమే స్వంతంగా హాస్టల్, స్కూల్ నిర్మాణానికి ముందడుగు వేయాలా అని బ్లాగులో పోల్ పెట్టాము. 64 మంది స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. ఇందులో సగం కంటే కొంచెం ఎక్కువగా ప్రాజెక్టుకు అనుకూలంగా వోటు వేశారు. అయితే జీవని కార్యవర్గం ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిదానంగా ఆలోచిద్దామని, వాయిదా వేసింది.

2) వచ్చే విద్యా సంవత్సరానికి మరో 10 మంది పిల్లల్ని తీసుకుని, మొత్తం 20 మందిని చేయాలని కార్యవర్గం తీర్మానించింది. రాజీ పడకుండా పిల్లలకు విద్య, జీవన సౌకర్యాలు అందించాలి. ఖర్చుకు వెనుకాడకుండా ఇందుకు ముందడుగు వేయాలి. వారికి ఏ లోటూ రానివ్వకూడదు. మిగతా సంస్థలకు భిన్నంగా జీవని పని చేయాలి.

3) ప్రస్తుతం పిల్లలు ప్రైవేటు స్కూల్లో హాస్టల్ వసతితో పాటు ఉంటున్నారు. వచ్చే సంవత్సరానికి మనమే సొంతంగా హాస్టల్ రన్ చేయాలి.

4) ప్రచార ఆర్భాటాలకు జీవని ప్రస్తుతం చాలా దూరంగా ఉంటోంది. మన డోనర్లు మిత్రులకు తప్ప సంస్థ ఉన్నట్టు ఎవరికీ తెలియదు. కానీ మనం కూడా ప్రజలకు తెలియాలి. వ్యక్తులు ఫోకస్ కాకూడదని మనం ఆశయంగా పెట్టుకున్నాము. అలాగే చేస్తూ సంస్థ పేరును మాత్రం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇందుకు సంబంధించి ఏవైనా కార్యక్రమాలు రూపొందిస్తే బావుంటుంది.

5) ప్రతి నెలా రెండో శనివారం జీవని సభ్యులు సమావేశం కావడం.


6) జీవని సంస్థకు ఒక లోగోను రూపొందించాలి.

7) పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడానికి కొన్ని కమిటీలు వేయడం. వాటికి స్పష్టమైన బాధ్యతలు అప్పగించడం. రొటేషన్ పద్ధతిలో సభ్యులను వారి వీలును బట్టి ఇన్వాల్వ్ చేయడం.

8) సభ్యులందరికీ సభ్యత్వ కార్డులు ఇవ్వడం.

9) జీవనికి సంబంధం ఉన్న వ్యక్తులు దాదాపు 300 మంది ఉన్నారు అనుకున్నాము. వీరికి తెలిసిన వారు మరి కొంత మంది ఉంటారు. వీరందరిలో రకరకాల రంగాల్లో ఉన్నవారు ఉంటారు. మనం అందరికి సంబంధించిన డాటాబేస్ తయారుచేస్తాము. వీరిలో ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారు, డాక్టర్లు, లాయర్లు, బిజినెస్ రంగంలో ఉన్నవారు... ఇలా ఎంతోమంది తేలుతారు. వారిని సంస్థ సంప్రదించి వారికి అంగీకారం అయిన పక్షంలో మన జీవని సభ్యుడు ఎవరు వెళ్ళినా సహాయ సహకారాలు అందించాలి. ప్రొఫెషనల్స్ - సహాయాన్ని, బిజినెస్ వాళ్ళు- నాణ్యమైన వస్తువులు తగ్గింపు ధరల్లో అందేలా చేస్తారు. మనం చేసేదల్లా అందరినీ కలపడం మాత్రమే. దీన్ని ప్రస్తుతానికి అనంతపురం వరకు పరిమితం చేస్తున్నాము.

10)సంస్థకు ఒక ఆడిటర్ ను నియమించుకోవడం.

మిత్రులారా ఇవి సలహామండలి సభ్యులు ఇచ్చిన సూచనలు. వీటిని అమలు చేయవలసిందిగా కార్యవర్గం ప్రధాన కార్యదర్శికి సిఫారసు చేసింది.



Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More




నిన్న సాయంత్రం పిల్లల్ని రాజీవ్ చిల్డ్రన్ పార్క్ కు తీసుకెళ్ళాము. ఈ సారి కూడా రాధిక టీచర్ గారు పిల్లలకు రకరకాల తిండి పదార్థాలు కొని ఇచ్చారు. అలాగే మేము కూడా తీసుకెళ్లాము. ఒకటిన్నర గంట పాటు పిల్లలు పార్కులో ఆనందంగా ఆడుకున్నారు.




Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More

మిత్రులారా నిన్నటి రోజు అశోక్ (5) అనే అబ్బాయిని మనం తీసుకోవడం జరిగింది. ఈ పిల్లవాడి అమ్మను వాళ్ల నాన్న హత్య చేసి చంపి పారిపోయాడట. అవ్వా తాతలు వాడి ఆలనాపాలనా చూసేవారు. అబ్బాయిది కర్నూల్ జిల్లా ఆదోని.




ఒకటి రెండురోజుల్లో మరో అబ్బాయిని తీసుకోవలసి ఉంది.


Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo