The best way to find yourself is to lose yourself in the service of others.


-Gandhiji

జీవని బ్లాగు చూసి, మిత్రుల ద్వారా సర్క్యులేట్ అవుతున్న పాంప్లెట్ చూసి స్పందిస్తున్న ఎందరో మిత్రులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాం. స్వచ్చంద సంస్థలంటే డబ్బుల సంపాదనకు రాజమార్గం అని ఎంత చెడ్డ పేరు రావాలో అంతా వచ్చేసింది. అయితే ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే నిజంగా సేవలు అందుతూవుంటాయి. అయినప్పటికీ ఇంకా నమ్మకంతో మీరంతా స్పందిస్తున్న తీరుకు ధన్యవాదాలు చెప్పలేకుండా ఉన్నాం. మిత్రులారా అందుకే జీవనిని డిఫరెంట్గా తీర్చిదిద్దుతున్నాం. డబ్బు వినియోగం విషయంలో నిక్కచ్చిగా ఉంటున్నాం. అందుకే మిత్ర బ్రుందాలలో స్పందన రోజు రోజుకూ పెరుగుతోంది. ముందునుంచీ చెబుతూ వస్తున్నాం జీవనిలో దాపరికానికి చోటు లేదు. ప్రతి రోజూ జమాఖర్చులు మన సభ్యులందరికీ messages ద్వారా తెలియపరుస్తూనే ఉన్నాం. పిల్లలకు కావలసిన వస్తువులు ( దుప్పట్లు, పుస్తకాలు వగైరా..) కొనుగోలు చేస్తున్నాం. ఇది పూర్తి అవగానే ఆదివారం లోపు జమాఖర్చులు బ్లాగ్లో పెడతాము. ఏ ఒక్కరికీ ఎక్కడా అనుమానం రాకూడదనేది మా ఆశయం. తాము ఇచ్చిన విరాళం పూర్తిగా సద్వినియోగం అయిందని ప్రతి దాతా త్రుప్తిపడాలి. జీవనికి విరాళం ఇవ్వడానికి వెనుకాడవలసిన అవసరం లేదని ఫీల్ కావాలి. అప్పుడే మేము పూర్తి స్థాయిలో విజయం సాధిచినట్లు. ఆ నమ్మకం మాకుంది. ఈ దిశగా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా మనవి. దాతలే కాదు, ఎవరైనా జీవనికి సలహాలు సూచనలు ఇవ్వవచ్చు. చివరగా... మీరు చేసే ప్రతి సూచనా సహాయం పిల్లల అభ్యున్నతికి ఉపయోగపడతాయి.

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo